OPERATION SINDOOR: బోర్డర్ దాటకుండా.. పాక్‌లో వైమానిక దాడులు.. ఎలా సాధ్యం?

పాక్‌లోకి వెళ్లకుండా క్షిపణిలు ఉపయోగించి భారత్ దాడులు నిర్వహించింది. క్షిపణి సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో భారత్ ఒకటి. బియాండ్ విజువల్ రేంజ్ టెక్నాలజీతో ఉన్న క్షిపణులతో బోర్డర్ దాటకుండా దాడులు నిర్వహించింది.

New Update

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లో వైమానిక దాడులు చేయడంతో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే భారత సైన్యం బోర్డర్ దాటకుండా ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌లో దాదాపుగా 200 కి.మీ వరకు మెరుపు దాడులు నిర్వహించింది.

ఇది కూడా చూడండి:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి:BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

దేశ సరిహద్దు నుంచి..

పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్‌లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద రహస్య స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఇందులో బహవల్పూర్ లక్ష్యంగా దాడి చేసింది. ఈ ప్రదేశం భారత సరిహద్దు నుంచి దాదాపుగా 200 కి.మీ దూరంలో ఉంది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

పాక్‌లోకి వెళ్లకుండా క్షిపణిలు ఉపయోగించి భారత్ దాడులు నిర్వహించింది. భారతదేశం క్షిపణి సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటి. భారతదేశం వద్ద ఉన్న అనేక క్షిపణులు చైనా, అమెరికా కంటే కూడా అధునాతనమైనవి. బియాండ్ విజువల్ రేంజ్ టెక్నాలజీతో ఉన్న క్షిపణులతో దాడి చేశారు. ఇవి అత్యంత ఆధునిక రాఫెల్ యుద్ధ విమానాలు. దాదాపుగా 200 కి.మీ వరకు వెళ్లి దాడి చేయగలవు. 

Advertisment
తాజా కథనాలు