ECI: ఓటరు ఐడీపై ఈసీ సంచలన ఆదేశాలు

తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. ఎవరికైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే ఒక్కదాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని.. అదనపు కార్డులు అప్పగించాలని సూచించింది.

New Update
Election Commission

Election Commission

ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాయని విమర్శించారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. ఎవరికైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే ఒక్కదాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని.. అదనపు కార్డులు అప్పగించాలని సూచించింది.   

Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

'' ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటం అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం నేరం. సెక్షన్ 31 కింద వాళ్లకు గరిష్ఠంగా ఏడాది కాలం శిక్ష లేదా జరిమానా ఒక్కోసారి రెండూ ఉండోచ్చు. ఒకవేళ ఎవరి దగ్గరైన రెండు లేదా అంతకన్నా ఎక్కువగా ఓటరు కార్డులు ఉంటే ఒకటి మాత్రమే దగ్గర ఉంచుకోవాలి. మిగిలిన వాటిని సరెండర్ చేయాలి. ఓటరు లిస్టులో రెండు చోట్ల ఓటరుగా ఉంటే ఒకచోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఈ వెసులుబాటు ఉందని'' ఎన్నికల సంఘం వివరించింది.  

Also Read: ఇదే మావా అసలైన అదృష్ణమంటే.. దెబ్బకు రూ.35 కోట్లు సొంతం

ఇదిలాఉండగా కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ సెల్‌ ఛైర్మన్ పవన్‌ ఖేడాకు రెండు ఓటరు కార్డులున్నట్లు ఫిర్యాదు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం ఆయనకు ఇటీవలే నోటీసులు జారీచేసింది. దీనిపై ఖేడా స్పందించారు. ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టారు. డిలీట్‌ చేయాలని గతంలో తాను అప్లై చేసినప్పటికీ ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఓటరు లిస్టు నుంచి తన పేరు తొలగించలేదని చెప్పారు.    

Also Read: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

Advertisment
తాజా కథనాలు