Rekha Gupta: ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండి.. సీఎం రేఖాగుప్తా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను జాతీయ మీడియా ఓ ప్రశ్న వేసింది. దీనికి ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాదని.. ఎవరైనా ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Delhi CM Rekha Gupta

Delhi CM Rekha Gupta

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అనంతరం.. హైకమాండ్‌ రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అనుభవం లేకపోయిన ఆమెకు సీఎం పదవి అప్పగించడం చర్చనీయాశంమైంది. అయితే తాజాగా రేఖాగుప్తాను జాతీయ మీడియా ఓ ప్రశ్న వేసింది. దీనికి ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ఉర్దూ కవి అయిన రహత్ ఇందోరి రాసిన షాయరీని రేఖా ప్రస్తావించారు. నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాదని.. ఎవరైనా ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండని అన్నారు.  

Also Read: పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

'' సీఎం అవ్వడం నా కల కాదు. నా పని చేసుకుంటూ నేను వెళ్లాను. ఈ పదవీ అనేది లాటరీ లాంటిది కాదు. మనదేశంలో మహిళలపై ఉన్న గౌరవానికి ఇదొక చిహ్నం. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతోనే నన్ను సీఎంగా నియమించారు. ఇందుకోసం ప్రధానమంత్రి మోదీ, పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ నిర్ణయం దేశ మహిళలకు మంచి సందేశాన్ని ఇస్తుందని'' రేఖా గుప్తా అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో లోపాలు సరిదిద్దడం కోసం అనినీతిని అంతం చేసేందుకు తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. 

Also Read: ఆడ బిడ్డకు తల్లైన అఘోరి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..!

ఇదిలాఉండగా.. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో రేఖా గుప్తా సీఎం అయ్యారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఈ అవకాశం దక్కడం విశేషం. ఆమె సీఎంగా ఎన్నికైన అనంతరం ఆప్‌ విమర్శలు చేసింది. బీజేపీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదని.. అతిశీ చేసిన విమర్శలను రేఖాగుప్తా తిప్పికొట్టింది. ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్‌ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి. ఇన్నేళ్లుగా మీరు ఏం చేశారో  చూడకుండా మేము అధికారంలోకి వచ్చిన ఒక్కరోజులోనే విమర్శిస్తారా అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.   

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

Advertisment
తాజా కథనాలు