Delhi Airport : ఎయిర్‌పోర్టులో ‘మానవ అస్థిపంజరం’ షాకైన అధికారులు.. ట్విస్ట్‌ ఏంటంటే?

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద  బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది.

New Update
delhi airport

delhi airport Photograph: (delhi airport)

Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(delhi-airport) లో  ఆస్తిపంజరం(skeletons) కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద  బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఏజెన్సీ, ఢిల్లీ పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఆ బ్యాగ్ ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఒక వైద్య విద్యార్థికి చెందినదిగా గుర్తించారు.

Also Read :  ఓసీల ఢిల్లీ మహాధర్నా ఫిబ్రవరి 23కు వాయిదా : పోలాడి రామారావు వెల్లడి

Demo Skeleton In Delhi Airport

బ్యాగులో ఉన్నది వైద్య విద్యలో ఉపయోగించే డెమో అస్థిపంజరం అని పోలీసులు నిర్ధారించారు. సాధారణంగా వీటిని మెడికల్‌ కాలేజీల్లో ఉపయోగిస్తారని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి నేరానికి సంబంధం లేదని, అనుమానాస్పద పరిస్థితులు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ అది  మనిషి అస్థిపంజరమా లేదా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించే నమూనానా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిజానిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Also Read :  కశ్మీర్‌లో ఆపరేషన్‌ త్రాషి–ఇ..జైషే టాప్‌ కమాండర్‌ హతం

Advertisment
తాజా కథనాలు