Mahadharna : ఓసీల ఢిల్లీ మహాధర్నా ఫిబ్రవరి 23కు వాయిదా : పోలాడి రామారావు వెల్లడి

ఓసీ ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 27 న నిర్వహించ తలపెట్టిన ఓసీ ల మహాధర్నా ను ముందుకు మార్చినట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామరావు వెల్లడించారు.

New Update
FotoJet (5)

oc jac mahadharna

ఓసీ ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసీ జేఏసీ(oc jac) ఆధ్వర్యంలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద వచ్చే నెల ఫిబ్రవరి 27 న వేలాది మందితో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీ ల మహాధర్నా(OCs Delhi Mahadharna postponed) ను ముందుకు మార్చినట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామరావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన మేరకు అనివార్య కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన ఫిబ్రవరి 27 న కాకుండా ఫిబ్రవరి 23 వ తేదీన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read :  కశ్మీర్‌లో ఆపరేషన్‌ త్రాషి–ఇ..జైషే టాప్‌ కమాండర్‌ హతం

OCs' Delhi Mahadharna

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని, ఓసీ ల స్థితి గతుల అధ్యయనానికి చట్టబద్ధతగల ప్రత్యేక జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటుచేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని,50 శాతం దాటకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసీ లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రదాన డిమాండ్ల తో ఫిబ్రవరి 23 న ఢిల్లీలో జంతర్ మంతర్(jantar-mantar) వద్ద జాతీయ స్థాయిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వివిధ రాష్ట్రాల ఓసీ ఐకాస సంఘాలను కలుపుకొని ఐక్యంగా నిర్వహించ తలపెట్టిన  ఓసీ ల మహాధర్నా కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసీ సామాజిక వర్గీయులు పార్టీలకతీతంగా తరలి రావాలని పోలాడి రామారావు(Poladi Rama Rao) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఓసీ ఐకాస నాయకులు జున్నూ తుల రాజిరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి ,దడిగేల వెంకటేశ్వర్ రావు, తోపు చర్ల శ్రీనివాస్,  రాజమడుగు నరసింహా రావు. ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు తాటిపల్లి రాజన్న నాయకులు పాల్గొన్నారు.

Also Read :  భర్తను మంచానికి కట్టేసి.. చివర్లో పోకిరి లెవల్ ట్విస్ట్ మావా!

Advertisment
తాజా కథనాలు