Jammu Kashmir : కశ్మీర్‌లో ఆపరేషన్‌ త్రాషి–ఇ..జైషే టాప్‌ కమాండర్‌ హతం

జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో జైషే మహమ్మద్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

New Update
FotoJet (4)

Jaish-e-Mohammed terrorist

Jammu Kashmir : జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బిల్లావర్‌లోని పర్హెటర్‌ ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ల సంయుక్త నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో జేషే కమాండర్‌ ఉస్మాన్‌ అలియాస్‌ అబూ మవియా హతమైనట్లు జమ్మూ ఐజీ భీమ్‌ సేన్‌ టుటి వివరించారు. మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమచారంతో  బలగాలు దాడి చేయగా లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. 

 ఈ సందర్భంగా ఆర్మీ కూడా ప్రతీగా జరిపిన ఎదురుకాల్పుల్లో ఉస్మాన్‌ హతమయ్యాడని చెప్పారు. ఘటనలో అత్యాధునిక ఎం4 ఆటోమేటిక్‌ రైఫిల్‌తోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా పట్టుబడ్డాయని ఆర్మీ అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా ఓ విదేశీ ఉగ్రవాదిని చంపేసినట్లు ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. ఆ ప్రాంతంలో కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోందని కూడా వెల్లడించింది. ఈ నెల 7, 13వ తేదీల్లో కహోగ్, నజోట్‌ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉస్మాన్‌ తప్పించుకున్నాడని పేర్కొంది. 

పాకిస్తాన్‌కు చెందిన ఉస్మాన్‌ రెండేళ్ల క్రితం దొంగచాటుగా సరిహద్దులు దాటి కశ్మీర్‌లోకి ప్రవేశించాడు. ఉథంపూర్‌– కథువా ప్రాంతంలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాదిగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఉస్మాన్‌ జేషే మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా మారాడు . గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బలగాలు ఆపరేషన్‌ త్రాషి–ఇ పేరుతో కూంబింగ్‌ నిర్వహిస్తు్న్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పారాట్రూపర్‌ నేలకొరగ్గా, ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. నాలుగు రోజులపాటు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. గురువారం ఎదురుకాల్పుల సమయంలో ఉస్మాన్‌ మరికొందరు దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా మల్చుకుని పరారయ్యారు.  తాజా ఎన్‌కౌంటర్‌లో నెలకొరిగాడు.

Advertisment
తాజా కథనాలు