Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్!

యువ జంటలలో విడాకులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునే జంటలకు వివాహానికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
odisha govt

odisha govt

Odisha Govt: యువ జంటలలో విడాకులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి చేసుకునే జంటలకు వివాహానికి ముందు కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్ విజయ రహత్కర్ సూచన మేరకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఒడిశాకు వచ్చిన రహత్కర్, ఇక్కడ జరిగిన ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ 32వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. 

Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే

విడాకుల రేటు తగ్గుతుంది

ఈ సందర్భంగా ఆమె  రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిశారు. NCW చైర్‌పర్సన్ సూచనలను అంగీకరిస్తూ సీఎం మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతూ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా వివాహానికి ముందు వైవాహిక జీవితం గురించి సరైన సలహాలు ఇస్తే, విడాకుల రేటు తగ్గుతుందని అన్నారు. 2025 సంవత్సరాన్ని రాష్ట్రం విడాకుల నివారణ సంవత్సరంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అన్నారు. రాబోయే ప్రీమెరిటల్ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇలాంటి అనేక విడాకుల సమస్యలు పరిష్కరించబడతాయని మేము ఆశిస్తున్నామని పరిదా తెలిపారు. ఈ కేంద్రాలకు మదర్స్ కోర్ట్ అని పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు.  

"యువ జంటలకు సంబంధించిన విడాకుల కేసులు రాష్ట్రంలో  పెరుగుతున్నాయి. వారి మధ్య అవగాహన లేకపోవడం వల్ల, యువ జంటలు విడాకులు వైపు వెళ్తున్నారు. ఒడిశా వంటి సంపన్న రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలను తగ్గించడానికి, వారికి అర్థమయ్యేలా చేయడానికి, మేము 2025 సంవత్సరాన్ని విడాకుల నివారణ సంవత్సరంగా మార్చేందుకు ప్రయత్నిస్తాం అని డిప్యూటీ సీఎం మీడియాతో అన్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని, బాల్యవివాహాలు, మహిళలపై హింసను నివారించడానికి చర్యలు తీసుకోవాలని, కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని NCW చైర్‌పర్సన్ సీఎంను కోరారు.   ఒడిశాలో మహిళల పరిస్థితి వేగంగా మారుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయ పథకం సుభద్ర యోజన ద్వారా వారికి సాధికారత కల్పించాలని కోరారు.  

Also Read :  PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ

Also Read :Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు