/rtv/media/media_files/2025/07/15/aiims-2025-07-15-07-37-30.jpg)
AIIMS Student Suicide
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 20 ఏళ్ళ విద్యార్థిని క్యాపంస్ లోనే తనకు తాను నిప్పంటించుకుని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలజీకి చెందిన ప్రోఫెసర్ ఆమె చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని...దాని గురించి ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిప్పంటిచుకున్న విద్యార్థినికి వెంటిలేషన్, ఐవీ, యాంటీబయాటిక్స్, కిడ్నీ చికిత్స అందించినా బతకలేదు. కాలిన గాయాలు తీవ్రంగా ఉండడంతోనే మరణించిందని ఎయిమ్స్ ప్రకటించింది.
Odisha Student Who Set Herself On Fire Dies: AIIMS Bhubaneswar
— NDTV (@ndtv) July 15, 2025
https://t.co/O2dlUh9roqpic.twitter.com/J38ExrrQYS
నేరస్థులను వదిలేది లేదు..
విద్యార్థిని మృతిపై ఒడిశా ముఖ్యమంత్రి మాంఝి స్పందించారు. ఆమె మృతపట్ల విచారం వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. దాంతో పాటూ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. ఈ కేసులో కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు. 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీని తరలించారు.
Also Read: Ind Vs Eng: సిరాజ్ షాకింగ్ ఔట్..ఓటమి నిరాశలో భారత్..