/rtv/media/media_files/2026/01/23/up-2026-01-23-21-48-01.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్‌పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య సోని, ఒకరోజు అతడిని మడత మంచానికి గట్టిగా కట్టేసింది. అంతటితో ఆగకుండా అతడిని కొడుతూ రచ్చ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMlpic.twitter.com/uCp3h2XqJK
— NDTV (@ndtv) January 23, 2026
అయితే, ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. తన కొడుకును కట్టేసి కొట్టడంపై అత్తకు తీవ్ర కోపం వచ్చింది. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కోడలిపై ఫిర్యాదు చేసింది. తన కోడలు దగ్గర ఒక నాటు తుపాకీ ఉందని, దాంతో ఎప్పుడూ తన కొడుకును చంపేస్తానని బెదిరిస్తోందని ఆరోపించింది. సాక్ష్యం కోసం సోని తుపాకీ పట్టుకుని ఉన్న ఒక ఫోటోను కూడా పోలీసులకు చూపించింది. గత రెండేళ్లుగా కోడలు తమను వేధిస్తోందని ఆ అత్త వాపోయింది.
ఇరుగుపొరుగు వారితో కూడా గొడవ
ఈ గొడవపై పోలీసులు స్పందిస్తూ.. ప్రదీప్ తాగి వచ్చి ఇరుగుపొరుగు వారితో కూడా గొడవ పడుతుంటాడని, అందుకే భార్య అతడిని కట్టేసిందని ప్రాథమికంగా తెలిసినట్లు చెప్పారు. ప్రస్తుతం భార్య సోనిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఆ తుపాకీ కథ ఏంటనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Follow Us