Prashanth Kishore: ప్రశాంత్ కిషోర్‌కు బిగ్ షాక్.. ఈసీ నోటీసులు

జన్‌సూరజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్‌ కిషోర్‌కు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెండు ఓటరు ఐడీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లో ఆయన స్పందించాలని ఆదేశించింది.

New Update
Notice issued to Prashant Kishor over name in voter lists of Bihar and west Bengal

Notice issued to Prashant Kishor over name in voter lists of Bihar and west Bengal

మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఎన్నికల సంఘం ఫేక్‌ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జన్‌సూరాజ్‌ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఆయనకు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెండు ఓటరు ఐడీలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. దీనిపై మూడు రోజుల్లో ఆయన స్పందన తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: హోటల్‌లో బిల్లు కట్టకుండా పారిపోయేందుకు యత్నించిన అమ్మాయిలు.. చివరికి ఊహించని షాక్

ఎన్నికల అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ కిషోర్‌కు వెస్ బెంగాల్‌లోని కాళీఘాట్‌ రోడ్‌లో ఓటరు ఐడీ ఉంది. టీఎంసీ పార్టీకి ఇది ప్రధాన కార్యాలయం అడ్రెస్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ అక్కడి నుంచే పోటీ చేశారు. అప్పట్లో ఆయన టీఎంసీకి రాజకీయ సలహాదారుడిగా పనిచేశారు. అలాగే బీహార్‌లోని తన స్వస్థలమైన కార్గహర్‌ నియోజకవర్గంలో కూడా ఆయన ఓటరు ఐడీ ఉంది.   

Also Read: ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.. మహాఘఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదల..

మరోవైపు ఎన్నికల సంఘం పంపిన నోటీసులపై జన్‌ సూరాజ్‌ పార్టీ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందించారు. ఇది ఈసీ తప్పిదమేనని పేర్కొన్నారు. ఓటరు కార్డులు జారీ చేసే అంశంలో ఈసీనే సక్రమంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కౌంటర్ వేశారు. ప్రశాంత కిషోర్ లాంటి ప్రముఖుల వ్యక్తుల విషయంలోనే తప్పులు చేసిన ఈసీ.. ఇక సాధారణ ఓటర్ల అంశంలో ఎలా వ్యవరిస్తుందో తెలిసిందేనంటూ సెటైర్లు వేశారు. 

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం నియమావళికి కేబినెట్ ఆమోదం

Advertisment
తాజా కథనాలు