/rtv/media/media_files/2025/10/28/maha-gathbandhan-manifesto-2025-10-28-17-36-28.jpg)
Maha gathBandhan Manifesto
BIG BREAKING: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే విపక్ష కూటమి మహాఘఠ్‌బంధన్ మంగళవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా ఇతర కూటమి నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి 'తేజస్వీ ప్రాణ్' అనే పేరు పెట్టారు. మేనిఫెస్టో కవర్ పేజీపై తేజస్వీ యాదవ్ ఫొటో ఉంది.
Patna, Bihar: Mahagathbandhan releases its manifesto for the Bihar Assembly elections pic.twitter.com/w41vP59E6u
— IANS (@ians_india) October 28, 2025
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 20 రోజుల్లో ప్రతి కుటంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని ప్రవేశపెడతామని మహాఘఠ్ బంధన్ కూటమి హామీ ఇచ్చింది. ఉద్యోగాలు అందించే ప్రక్రియ 20 నెలల్లోపు ప్రారంభమవుతందని పేర్కొన్నారు.
మహిళల కోసం 'మై-బెహిన్ మాన్ యోజన'
డిసెంబర్ 1 నుండి మహిళలు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం పొందుతారు. ఐదేళ్లలో వాళ్లు మొత్తం రూ.30,000 అందుకుంటారు. కుమార్తెల కోసం "BETI" పథకం, అలాగే తల్లుల కోసం "MAI" పథకాన్ని ప్రకటించారు.
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం
కాంట్రాక్టు అలాగే అవుడ్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి హోదా అలాగే రూ. 30 వేల జీతం పొందుతారు.
పాత పెన్షన్ పథకం
పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉచిత విద్యుత్, పెన్షన్
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని తెలిపారు. అలాగే వృద్ధులు, వితంతువులు నెలకు రూ.1500, వికలాంగులకు రూ.3000 పెన్షన్ అందిస్తామని ప్రకటించారు.
విద్య, ఉపాధికి ప్రాధాన్యత
ప్రతి సబ్‌డివిజన్‌లో మహిళా కళాశాలలు, 136 బ్లాక్‌లలో కొత్త డిగ్రీ కళాశాలలను ప్రకటించారు. పోటీ పరీక్షలకు ఫారమ్ ఫీజులను తొలగించడం, విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం లాంటి హామీ ఇచ్చారు.
రైతులకు MSP హామీ
రాష్ట్రంలో అన్ని పంటల కొనుగోల్లకు కనీస మద్దతు ధర(MSP) ఇస్తామని ప్రకటించారు.
ఆరోగ్య రక్షణ
ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు సూపర్-స్పెషాలిటీ సౌకర్యాలతో అమర్చబడతాయి.
MNREGA అలాగే రిజర్వేషన్ విస్తరణ
MNREGA వేతనాలను రూ255 నుండి రూ.300కి పెంచుతున్నట్లు అలాగే పని దినాల సంఖ్యను 100 నుండి 200కి పెంచుతున్నట్లు ప్రకటించారు. OBC, SC/ST వర్గాలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలనే ప్రతిపాదన చేశారు.
జీరో టాలరెన్స్ పాలసీ
నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా జీరో- టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. పోలీసు అధికారులకు స్థిర పదవీకాలాలు ప్రతిపాదించారు.
మైనారిటీ, వక్ఫ్ ఆస్తి రక్షణ
వక్ఫ్ సవరణ బిల్లుపై తాత్కాలిక నిషేధం అలాగే పారదర్శక ఆస్తి నిర్వహణకు హామీ ఇచ్చారు. బోధగయలోని బౌద్ధ దేవాలయాల నిర్వహణను కూడా బౌద్ధ సమాజానికి అప్పగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇదిలాఉండగా బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 14వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Follow Us