/rtv/media/media_files/2025/08/06/kerala-high-court-2025-08-06-21-40-19.jpg)
No toll collection, if no unhindered, regulated access to highways ensured by NHAI, Says Kerala HC
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రోడ్ల విషయంలో ప్రయాణికులకు సరైన సేవలు అందించాలని సూచించింది. లేకపోతే టోల్ రుసుం వసూలు చేయలేరని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), సంబంధిత ఏజెన్సీలకు హెచ్చరించింది. NH-544లో ఎడప్పల్లిమన్నుతి రూట్‌లో టోల్ వసూళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లైఓవర్లు, డ్రైనేజీల వంటి నిర్మాణ పనులు, సర్వీస్ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల హైవేపై ట్రాఫిక్ ఏర్పడుతోందని, దీనివల్ల టోల్ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read: 45 పైసలకే ప్రమాద బీమా, ఐదేళ్లలో రూ.27.22 కోట్లు చెల్లించాం.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
దీనిపై విచారించిన హైకోర్టు.. '' జాతీయ రహదారిని వినియోగించుకున్నందుకు ప్రయాణికులు టోల్ ఛార్జీలు చెల్లించాలి. అలాగే రోడ్డుపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత NHAI, సంబంధింత ఏజెన్సీలపై ఉంది. ప్రజలకు, NHAIకి మధ్య పరస్పర విశ్వాసంతో బాండింగ్ ఉంది. దీనిపై ఉల్లంఘన జరిగితే టోల్ వసూలు చేసే హక్కును ప్రజలపై బలవంతగా రుద్దలేం. NHAI ఈ కేసులో ప్రజాప్రయోజనాలు విస్మరించింది. వాళ్ల ఫిర్యాదులను పట్టించుకోలేదని'' హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also Read: సీఎం పేర్లతో పథకాలు.. మద్రాస్ హైకోర్టు తీర్పును ఖండించిన సుప్రీంకోర్టు
అలాగే టోల్ వసూలు అనేది కాంట్రాక్టులకు సంబంధించిన విషయమని NHAI కోర్టులో వాదించింది. దీన్ని అడ్డుకుంటే సంబంధింత చట్టాల కింద పరిణామాలకు దారితీస్తుందని చెప్పింది. అయినా కూడా హైకోర్టు NHAI వాదనలను తోసిపుచ్చింది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మధ్య జరిగే ఒప్పందాలు అనేవి ప్రజాప్రయోజనాలు మించినవి కావని తెలిపింది. మీరు ప్రజలకు సరైన సేవలు అందించకపోతే కేవలం కాంట్రాక్టు పేరిట టోల్ చెల్లించాలని బలవంతం చేయలేరంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు టోల్ వసూళ్లను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని సూచనలు చేసింది.
కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు టోల్ రోడ్డు కాంట్రాక్టర్లకు గట్టిగా హెచ్చరించినట్లయ్యింది. పౌరుల హక్కులను పరిరక్షించడంలో ఇదొక మైలురాయిగా నిలుస్తోందని చెబుతున్నారు. ఈ తీర్పు వల్ల రాబోయే రోజుల్లో టోల్ రోడ్డుపై ప్రయాణించే వాళ్లకు ఇకనుంచి మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉందని అంటున్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు . మరోవైపు ఇలాంటి నిర్ణయం దేశమంతటా అమలు చేయాలని మరికొందరు నెటిజన్లు కోరుతున్నారు. చాలాప్రాంతాల్లో సరైన సౌకర్యాలు ఉండటం లేదని చెబుతున్నారు. కోర్టులు ఇలాంటి తీర్పులిస్తే పరిస్థితులు మారుతాయని చెబుతున్నారు. ఇకనుంచైన సరైన సదుపాయాలు అందించాలని కోరుతున్నారు.
Hope this applies all across India !
— Dr Aniruddha Malpani, MD (@malpani) August 6, 2025
No toll collection if highway badly maintained: HC https://t.co/z72BI1NHUq