Nitin Gadkari: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచనలు చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నిధులు అవరమని చెప్పారు.

New Update
Nitin Gadkari

Nitin Gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచనలు చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నిధులు అవరమని చెప్పారు. అందుకే జీఎస్టీ, ఇతర పన్నులను తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దన్నారు. ఒక వేళ కేంద్రం పన్నులు తగ్గిస్తే.. మరికొంత తగ్గించాలని కోరుతారని, ఇది మనుషుల మనస్తత్వమని అన్నారు. 

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

తాము కూడా పన్నులు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం సాధ్యం కావడం కుదరదని అన్నారు. ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి.. పేదవారి అవసరాలు తీర్చడం ప్రభుత్వ దార్శనికత అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే దేశంలో లాజిస్టిక్స్‌ ఖర్చు రెండేళ్లలోపు 9 శాతానికి తగ్గుతుందని పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చారు.  

Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

అయితే చైనాలో లాజిస్టిక్స్‌ ఖర్చు ప్రస్తుతం 8 శాతం ఉందని.. యూరప్, అమెరికాలో 12 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో మూలధన పెట్టుబడులను పెంచితే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించుకోవచ్చని తెలిపారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు