/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
H1B Visa
చాలామంది హెచ్1 బీ వీసా మీద అమెరికాకి ఉద్యోగాలు చేసేందుకు వెళ్తుంటారు. అమెరికా వీసాల్లో అత్యంత డిమాండ్ ఉన్న వీసా కూడా ఇదే. అయితే ఈఏడాది మాత్రం హెచ్1బీ వీసాలు పొందడం చాలా కష్టమేని తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో మల్టినేషనల్ కంపెనీలు స్కిల్స్ ఉన్నవారని ఇతర దేశాల నుంచి రప్పించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2025లో 85 వేలకు మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదనే పరిమితిని విధించింది.
Also Read: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు
ఇక మార్చి 7న ప్రారంభమైన హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాలు పొందేందుకు ఇప్పటికే ఏకంగా 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో 3 లక్షలకు పైగా దరఖాస్తులు రిజెక్ట్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం విధించిన రూల్స్ ప్రకారం చూసుకుంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో 20 శాతానికి మించి H1బీ వీసాలు పొందే ఛాన్స్ లేదు.
విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు లేదా ఇతర అధిక నైపుణ్యాలు ఉన్నవారిని దీర్ఘకాలం పనిచేసే విధంగా హెచ్1బీ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. అయితే తాజాగా ట్రంప్ కఠిన రూల్స్ వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోనుంది. ఈ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫోర్బ్స్ కూడా తన నివేదికలో తెలిపింది.
Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?
అయితే హెచ్1బీ వీసాల కన్నా ఇతర విసాల మంజూరు సులభంగా ఉందనే పలు వర్గాలు చెబుతున్నారు. 2024లో టూరిస్టు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతం వరకు ఆమోదం తెలిపారు. అయితే అమెరికాలో హెచ్1 బీ వీసాల కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల పైనే వేతనం వస్తుంది. అయితే ఇప్పుడు హెచ్1 బీ వీసా జారీ విధానంలో కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల అమెరికా వెళ్లి ఉద్యోగం చేయలనుకునేవారికీ.. వీసా వస్తుందా ? లేదా? అనేది గ్యారెంటీ లేకుండా పోయింది.