ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం.. ఈసారి ఎక్కడంటే ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 'ది ఆర్డర్ ఆఫ్‌ ది నైజర్' గ్రాండ్ కమాండర్‌ను ఆయనకు అందించనుంది. మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం.

New Update
modi nig

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ఇటీవలే  కరేబియన్‌లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నైజీరియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 'ది ఆర్డర్ ఆఫ్‌ ది నైజర్' గ్రాండ్ కమాండర్‌ను ప్రధాని మోదీకి అందించనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు నైజీరియా ప్రభుత్వం ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత ఈ అవార్డును అందుకున్న విదేశీ ప్రధానిగా మోదీకి ఈ గౌరవం దక్కింది. 

Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

విదేశాల్లో ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం కావడం విశేషం. నైజీరియాలోని అబుజాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్ స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. అయితే ఇది భారత ప్రధానమంత్రిపై వాళ్లకున్న నమ్మకం, గౌరవానికి ప్రతీక అని విదేశీ వ్యవహారాలు మంత్రిత్వశాఖ తెలిపింది.  2007 నుంచి భారత్‌, నైజీరియా మధ్య భాగస్వామ్యం ఉంది. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 200లకు పైగా భారతీయ కంపెనీలు నైజీరియన్ ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెట్టాయి. అలాగే ఇరుదేశాల కూడా అభివృద్ధి సహకారం భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని మోదీకి నైజీరియా ఈ పురస్కారాన్ని అందించింది. 

Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!

 నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం నైజీరియాకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్నారు. నవంబర్ 18,19 తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఇతర దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. అలాగే గయనా దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు నవంబర్ 19న అక్కడికి వెళ్తారు. ఈ నెల 21 వరకు గయానాలోనే ఉంటారు.    

Also Read: ఆవు పేడలో నోట్ల కట్టలు.. పని చేసే ఆఫీసుకే కన్నం వేసిన ఓ దొంగ చేశాడంటే?

Also Read: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆప్‌కు మంత్రి రాజీనామా

Advertisment
Advertisment
తాజా కథనాలు