ఆవు పేడలో నోట్ల కట్టలు.. పని చేసే ఆఫీసుకే కన్నం వేసిన ఓ దొంగ చేశాడంటే?

ఒడిశాకి చెందిన గోపాల్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలు దొంగతనం చేసి పరారయ్యాడు. కంపెనీ యాజమాన్యం స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆవు పేడ కుప్పలో దాచిన నోట్ల కట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
money

ఓ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఆ ఆఫీస్‌కే కన్నం వేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలాసోర్‌కి చెందిన గోపాల్ బెహరా అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న లోకర్‌లో దొంగతనానికి పాల్పడ్డాడు. 

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

కంపెనీ లాకర్‌లో ఉన్న డబ్బును..

ఈ సమయంలో కంపెనీ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలు చోరీ చేశాడు. వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని తన బావమరిది అయిన రవీంద్ర బెహరాతో ఇంటికి పంపించి పరార్ అయ్యాడు.

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

అనుమానం వచ్చిన కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అతని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తన బావ మరిది ఇంటిపై హైదరాబాద్, ఒడిశా పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. 

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

ఈ క్రమంలో ఆవు పేడ కుప్పలో దాచిన ఆ రూ.20 లక్షల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  గోపాల్‌తో పాటు తన బావమరిది కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులను అదుపులో తీసుకున్నారు. పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు