అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు! ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో దెయ్యం భయం పట్టుకుంది. రెండు నెలల వ్యవధిలోనే గ్రామంలో 50 మంది మృతి చెందారు. మృతులంతా 30-50 ఏళ్ల మధ్య వయస్సు వారే అని గ్రామస్తులు చెబుతున్నారు. దెయ్యమే ప్రాణాలు తీస్తుందంటూ భయపడుతున్నారు. By Seetha Ram 17 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి అది ఒక విశాలవంతమైన గ్రామం. ఎటు చూసినా పచ్చని చెట్లు. చెట్లపై కిచ్ కిచ్ మనే పక్షుల శబ్దాలు. సాయంత్రం వేళ ఊరి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదకరమై వాతావరణం. ఊరి ప్రజలంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి ప్రశాంతమైన ఊరిలో సడెన్‌గా రోజుల వ్యత్యాసంలో చాలా మంది చనిపోయారు. దాదాపు 2 నెలల్లో 50 మంది మరణించడంతో.. ఆ గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆ ఊరిలో దెయ్యం తిరుగుతోందని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇదంతా మరెక్కడో కాదు తెలంగాణలోనే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read : నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! 2 నెలల్లోనే 50 మంది చనిపోయారు ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలోని ప్రజలు దెయ్యం భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ గ్రామంలో వరుసగా మరణాలు సంభవించడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. తమ ఊరికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 2 నెలల్లోనే 50 మంది చనిపోయారని చెబుతున్నారు. Also Read : రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి? అయితే చనిపోయినవారంతా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారే అని తెలుస్తోంది. ఊరికి కీడు సోకిందనే భయంలో దెయ్యమే ప్రాణాలు తీస్తుందంటూ గజగజ వణికిపోతున్నారు. అయితే అందరూ జ్వరం బారిన పడి ప్రాణాలు వదిలేశారని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అస్వస్థతతో పెద్ద ఆసుపత్రుల్లో చూపించినా బతకడం లేదని గ్రామస్తులు అంటున్నారు. Also Read : మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు! దీంతో గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి పట్టిన కీడు వదిలించుకునేందుకు దేవతలకు, బొడ్రాయికి పూజలు చేయాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇదే గ్రామంలో ఉంటే ప్రాణాలు పోతాయని భావించి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. అయితే అందులో ఉన్నత చదువులు చదివిన వారు ఉండటం విశేషం. Also Read : నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు వైరల్.. ఇంత సింపుల్‌గా ఉందేంటి..! ఆ గ్రామంలో నాలుగైదు రోజులకు ఒకరు మృతి చెందుతున్నారని.. ఏ క్షణంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని గజగజలాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా తమ గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. దాదాపు 50 మంది మరణించినా మంత్రి సీతక్క కూడా ఇప్పటివరకు రాలేదని మండిపడుతున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి బ్లడ్ శాంపిల్స్ సేకరించి జ్వరాలకు గల కారణాలు ఏంటో చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. #devil-fear #crime-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి