కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆప్‌కు మంత్రి రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే కారణంతో చేస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
Kailash Gehlot

ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని.. కానీ ఈ హామీని అమలు చేయకపోలేకపోవడంతో పలు అంశాలను కూడా లేఖలో తెలిపారు. 

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

ఎన్నికల ముందు భారీ ఎదురుదెబ్బే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ రాజీనామాతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కైలాష్ గెహ్లాట్ ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటీ, మహిళా, శిశు అభివృద్ధితో సహా కీలకమైన వాటికి ఇన్‌ఛార్జ్‌గా చేశారు. ప్రస్తుతం రవాణా, పర్యావరణ మంత్రిగా ఉన్నారు.

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

కైలాష్ గెహ్లాట్ ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లాస్, మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీలు పొందారు. 1974లో జూలై 22న న్యూఢిల్లీలో జన్మించారు. 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు