Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు

2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
 marriages in China crash to record low, while divorces on the rise

marriages in China crash to record low, while divorces on the rise

ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. చేసుకున్న వారిలో కూడా ఒకరు లేదా ఇద్దరి కన్నా ఎక్కువమంది పిల్లలను కనేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో ఆయా దేశాల్లో జనాభా సంక్షోభం పెరిగిపోతోంది.  ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా.. గత కొన్నేళ్లుగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య భారీగా తగ్గిపోతున్నట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి. 

Also Read: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!

2024లో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జనాభాను పెంచేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా అక్కడ యువత వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. 1986లో చైనా వివాహాల రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. అయితే అప్పటినుంచి ఇంత స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2013లో 1.3 కోట్ల వివాహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పుడు చాలావరకు తగ్గిపోవడంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.  

Also Read: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు

ఇదిలాఉండగా 2024లో 26 లక్షల జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2023తో పోలిస్తే 28 వేలు అధికంగా నమోదైనట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే విడాకుల సంఖ్యను తగ్గించేందుకు చైనా సర్కార్ గతంలోనే ఓ నిర్ణయం తీసుకుంది. విడాకుల కోసం అప్లికేషన్ పెట్టుకునే జంటలకు 30 రోజుల కూలింగ్ ఆఫ్‌ వ్యవధిని తప్పనిసరి చేసింది. 2021నుంచే దీన్ని అమలు చేస్తున్నా కూడా ఈ సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు