/rtv/media/media_files/2025/02/10/VfdWvNS5DLGtcHPsoHon.jpg)
More than 600 arrested for working illegally in UK
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని అక్కడి ప్రభుత్వం పంపిస్తోంది. ఇటీవల 200 మందికి పైగా భారతీయ అక్రమ వలసదారులను కూడా సైనిక విమానంలో వెనక్కి తరలించింది. మరో 600 మందిని తరలించేందుకు సిద్ధమవుతోంది. అయితే అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది.
Also Read: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!
ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. సోమవారం అక్రమ వలసదారులపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన ట్వీట్ చేశారు. '' అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం. బ్రిటన్‌లో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగింది. చాలామంది ఇక్కడికి అక్రమంగా వచ్చి పనులు చేసుకుంటున్నారని'' కీర్ స్టార్మర్ రాసుకొచ్చారు.
Too many people are able to come to the UK and work illegally.
— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025
We are putting an end to it.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే కీర్ స్టార్మర్ సర్కార్.. సరిహద్దు భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే 2025 జనవరిలో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు అక్రమంగా ఉంటున్న వందలాది మంది వర్కర్లను అదపులోకి తీసుకున్నారు. రెస్టారెంట్లు, బార్‌లు, కార్ వాషింగ్ సెంటర్స్ ఇతర స్టోర్లలో పనిచేస్తున్న 609 మందిని అరెస్టు చేశారు. 2024లో జులై నుంచి ఇప్పటిదాకా దాదాపు 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!