Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్‌, భారత్‌లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.

New Update
Earthquakes In Nepal

Earthquakes Nepal

నేపాల్‌లో తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది. 

పలు ప్రాంతాల్లో ఐదు సెకన్ల పాటు..

ఢిల్లీలతో పాటు బిహార్‌లోని మోతిహారి, సమస్తిపూర్, దర్భంగా, మధుబని, పూర్నియా, సివాన్, అరారియా, సుపాల్, ముజఫర్‌పూర్‌లోని పలు జిల్లాల్లో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూకంపం సంభవించింది. దాదాపు ఐదు సెకన్లు పాటు భూమి కంపించడం వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం కూడా అయ్యాయి. 

ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్‌ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!

ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

చైనాలోని షిగాట్సే నగరంలో కూడా 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత ఐదేళ్లలో షిగాట్సే నగరంలో భూకంపాలు సంభవించిన అవన్ని కూడా చిన్నవే. రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతోనే వచ్చేవి. కానీ ఈసారి ఇంత తీవ్రతతో భూకంపం సంభవించింది. 

ఇదిలా ఉండగా నేపాల్‌లో భారీ భూకంపాలు అనేవి సహజమే. ఇక్కడ ఎప్పటికప్పుడు భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో వచ్చిన భారీ భూకంపం వల్ల దాదాపుగా 9 వేల మంది మృతి చెందారు.  

ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

Advertisment
తాజా కథనాలు