Earthquake: ఒకేసారి మూడు భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు
ఉత్తరాఖండ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్లోని ఉత్తరాఖండ్ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.