/rtv/media/media_files/2025/01/18/EMYg1Wqerk4sxDwgUNnw.jpg)
Sanjay Roy
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను శనివారం సీల్దియా కోర్టు దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్ష విధించనుంది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి స్పందిస్తారు. తన కొడుకు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని మండిపడ్డారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారని .. ఆ వైద్యురాలు ఎదుర్కొన్న బాధను, నరకాన్ని అర్థం చేసుకోగలనంటూ వాపోయారు.
Also Read: పిల్లల ముందే బరితెగించిన టీచర్లు.. హగ్గులు, ముద్దులు! వీడియో వైరల్
''నా కొడుకు చనిపోతే నేను ఏడిస్తానేమో గానీ ఓ అమ్మాయి పట్ల ఇలా ప్రవర్తించినందుకు సంజయ్‌కు జీవించే హక్కు లేదు. నా కొడుకుకు మరణశిక్ష విధించినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ వైద్యురాలు కూడా నాకు కూతురితో సమానమే. కూతురుకి ఇలాంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ కూడా ఊరుకోదని'' సంజయ్ రాయ్ తల్లి అన్నారు.
అయితే ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తారా అని మీడియా అడగగా సంజయ్ రాయ్ సోదరి స్పందించారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. తమ సోదరుడు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని మేము ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. నేరం జరిగిన చోట సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని.. దీనిపై పోలీసులు, సీబీఐ దర్యాప్తు చేసి తగిన విధంగా శిక్ష విధించాలన్నారు.
Also Read: ఇంటిపై పడిన పేలోడ్ బెలూన్.. భయాందళనలో గ్రామస్థులు
2024 ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. చివరికి ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.