Kamala Hariss: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా

గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరాజయం పాలయ్యారు అయితే తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె మరికొన్ని రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

New Update
USA : కమలా హారిసే గెలుస్తారు‌‌ – నోస్ట్రాడమస్ అలెన్ లిచ్ట్‌మన్ జోస్యం

Kamala Harris

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. 2024 నవంబర్ నెలలో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లోనే తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని కూడా ఆమె ప్రకటించారు. అంతేకాకుండా ఆమె రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read:Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు

2024 నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేశారు. కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై విజయం సాధించ లేకపోయారు. ముఖ్యంగా ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోగా.. కమలా కు 226 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటమి పాలైన ఆమె ఓటమి తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని.. కానీ గెలవలేమని చెప్పారు. అంతేకాకుండా స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాలంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Trump-Musk-Rubio: ట్రంప్‌ క్యాబినెట్‌ మీటింగ్‌ లో గొడవ పడ్డ మస్క్‌..రూబియె

ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కమలా హారిస్ అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అయితే ఇటీవలే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కమలా హారిస్ తాను కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీకి సిద్ధం అయినట్లు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే ఈ వేసవి కాలంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆమె తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా గావిన్ న్యూసమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే కాలిఫోర్నియా ప్రజలు అంతా దశాబ్దాలుగా డెమోక్రట్లకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే.. కచ్చితంగా గెలుస్తానని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తే.. గెలిచినా, ఓడిపోయినా వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నారంట. 

Also Read;  Kannada Actress Ranya Rao: రన్యా రావు ఒంటి పై గాయాలు..అసలేమైంది!

Also Read: Gold Prices: పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంత పెరిగాయంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు