/rtv/media/media_files/2024/10/23/d4SyM0qtXrihuWGNNOaJ.jpg)
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీని కారణంగా సౌకర్యాలు పెరిగిపోయాయి. ప్రతీవారికి అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా భారత్ లో క్విక్ కామర్స్ బాగా పెరిగిపోయింది. ప్రతీదీ చేతుల్లోకి వచ్చి పడుతోంది. ఆమారంతో పాటూ ఏది కావాల్సినా నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నాయి క్విక్ కామర్స్. అమెజాన్ దగ్గర నుంచీ స్విగ్గీ, జొమాటో వరకు అన్నీ సర్వీసులు అందిస్తున్నాయి. దీంతో జనాలు కష్టపడ్డం మానేశారు. ప్రతీదీ ఇంటికే తెప్పించేసుకుంటున్నారు. ఒక్క ట్యాప్ తో రెస్టారెంట్లలో భోజనం దగ్గర నుంచీ కిరాణా సామాగ్రి, మందులు అన్నీ వచ్చేస్తున్నాయి. అది కూడా పది నిమిషాల్లో చేరుతున్నాయి. దీని కారణంగా బారతీయుల్లో పని చేయాలనే ఆలోచనే పూర్తిగా పోయింది. ఇక ఆన్ లైన్ ఫుడ్ డెలవరీల వల్ల అయితే తినే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వంటలు చేసుకోవడం మానేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఊపబకాయం పెరిగిపోయింది. దాంతో పాటూ ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.
ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతేదశంలో ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అంటే భారత్ లో ఉన్న 250 కోట్ల మంది పెద్దల్లో 89 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది కేవలం పెద్ద వాళ్ళ సంఖ్య మాత్రమే. పిల్లలు, టీనేజర్ల విషయానికి వస్తే 5 నుంచి 19 ఏళ్ళ లోపు పిల్లలు 16 కోట్ల మంది లావుతో బాధపడుతున్నారు. ఇవన్నీ డబ్ల్యూహెచ్వో 202లో చెప్పిన లెక్కలు. ఇప్పుడు మరో మూడేళ్ళల్లో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. అంతేకాదు ఆందోళనకరంగా కూడా ఉంది. 2030 నాటికి ప్రపంచంలో...బారత్ లో ఉన్నవారే ఎక్కువ అధిక బరువుతో బాధపడుతున్నావారు ఉంటారని డబ్ల్యూహెచ్ వో చెబుతోంది.
ఊబకాయం, అధిక బరువులతో పాటూ జనాల్లో జబ్బులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన పరిశోధనల్లో భారత్ లో ప్రతీ ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, వారిలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. దీంతో పాటూ హృదయ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నావారే ఇందుకు ఉదాహరణ. వీటన్నింటినీ నివారించాలంటే క్విక్ కామర్స్ లపై జనాలు ఆధారపడడం తగ్గించాలని చెబుతున్నారు. అంతేకాదు బయటఫుడ్ తినడం కూడా బాగా తగ్గించాలని అంటున్నారు. బయట దొరికే ఫుడ్ లో ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటోంది. దీని వలన కూడా ఊబకాయం వస్తోంది. వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిదని చెబుతున్నారు.
Follow Us