/rtv/media/media_files/2025/07/30/gslv-f16-2025-07-30-18-38-44.jpg)
GSLV-F16 | NASA-ISRO | NISAR
అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) రెండు కలిసి సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకిఈ రోజు ప్రయోగించారు. ఈరోజు సాయంత్రం 5.40 గంటలకు ఈ ప్రయోగం మొదలైంది.
Also read: INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
Naisaar’ Launch - GSLV-F16
ప్రయోగకేంద్రం సెకెండ్ లాంచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ GSLV F -16 రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ శాటిలైట్‌గా పేరున్న GSLV F - 16 నింగిలోకి మోసుకెళ్లింది.18ని 35 సెకండ్లలో ప్రయోగం పూర్తయినట్లు పరిశోధకులు ప్రకటించారు. భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులో నిసార్ శాటిలైట్‌ని నిర్దేశిత అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.. నింగిలోకి వెళ్లిన నిస్సార్ ఉపగ్రహం భూమిని స్కాన్ చేయడం ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్- షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న ‘నైసార్’ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో-నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ నిలిచింది. ఈ ఉపగ్రహం కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లను సమకూర్చింది. ఇక భారత్ 90 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటి. దీన్ని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) తొలిసారిగా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్) అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. రెండు సింథటిక్ అపర్చర్ రాడార్లు (సార్) అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే.
ఇస్రో-నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి ఉపగ్రహం ఇదే. భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో దీనిని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషిన్ కింద భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన మనకు తెలిసిందే. తాజాగా నైసార్ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనావేసి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. ఈ ఉపగ్రహం డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని నాసా తెలిపింది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేయడంలో ఉపగ్రహం భాగస్వామ్యం కానుంది.
Also read: పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్
isro | nellore | latest-telugu-news | telugu-news | national news in Telugu | andhra-pradesh-news