/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
Saif ali khan suspect arrested Photograph: (Saif ali khan suspect arrested)
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అన్ని రకాలుగా విచారిస్తున్నారు. ఇందులో నిందితుడు పలు కీలక విషయాలను తెలిపాడని పోలీసులు చెబుతున్నారు. దాంతో పాటూ పోలీసులు నిన్న నిందితునితో క్రైమ్ సీన్ రీక్రియేట్ కూడ చేయించినట్లు తెలుస్తోంది.
ఏసీ కండక్టర్ లో నుంచి...
బాంద్రాలో ఉన్న సైఫ్ ఇంటికి నిందితుడు ఇస్లాంను తీసుకెళ్ళారు పోలీసులు. అక్కడ లోపలికి ఎలా ప్రవేశించాడు, దాడి ఎలా చేశాడు అన్న విషయాలను తెలుసుకున్నారు. దాడి జరిగిన అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తుండగా.. నిందితుడు ఇస్లాం.. బిల్డింగ్ కాంపౌండ్ వాల్ దూకి ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత వెనుక ఉన్న మెట్లు ఎక్కి ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌ను ఊడదీసి...అందులో నుంచి సైఫ్ ఇంట్లోకి వచ్చాడు. చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులు తీసేసి బ్యాగ్‌లో దాచి.. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కూడా చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దాడి తర్వాత సైఫ్ తనని బాత్రూమ్‌లో బంధించాడని..అప్పుడు కూడా ఎయిర్ కండిషనింగ్ కండక్టర్ సాయంతో ఆ గది నుంచి బయటపడ్డానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. చెప్పినట్లు తెలుస్తోంది.
దాడి జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపయి బయటకు వచ్చాక అతను కోల్‌కత్తాలోని హావ్‌డా వెళ్లి అక్కడి నుంచి బంగ్లాదేశ్ పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. పలువురు ఏజెంట్లను కూడా సంప్రదించాడు. అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు అడగడంతో ఇవ్వలేకపోయానని నిందితుడు తెలిపాడు. ఇస్లాం వాడుతున్న సిమ్ కార్డు కూడా అతని పేరు మీద లేదు. ఇది బెంగాల్ లోని ఖుకుమోని జహంగీర్ సెఖా అనే అతని పేరుపై ఉంది. ఆధార్ కార్డు కూడా ఇదే పేరు మీద పొంది...కొన్నాళ్ళు అయినా ఎస్కేప్ అవ్వొచ్చని నిందితుడు అనుకున్నాడు. కానీ ఆధార్ కార్డు దొరకలేదు.