Kamareddy: కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రయాంగిల్ సూసైడ్ ఇష్యూలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఎస్‌ఐ భార్య పుట్టింటికెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఎస్‌ఐ ఫ్యామిలీలో ఘర్షణలు మొదలైట్లు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.
ఎస్‌ఐకి భార్య కండీషన్..
అయితే కానిస్టేబుల్‌తో విషయం తేల్చుకోవాలని ఎస్‌ఐకి భార్య కండీషన్ పెట్టిందని, దీంతో ఆ విషయం మాట్లాడుకునేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వచ్చినట్లు తెలిపారు. ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ముందుగా కానిస్టేబులో చెరువులో దూకింది. ఆ వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ దూకడంతో.. భయపడి ఎస్‌ఐ కూడా చెరువులో దూకేశాడని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు
కొంతకాలంగా సాన్నిహిత్యం..
ఇక సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి చెరువులో గురువారం అర్థరాత్రి సమయానికి లేడీ కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలో లభ్యమయ్యాయి. ఈరోజు ఎస్సై శవం దొరికింది. ఒకేచోట పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ శృతి కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. శృతికి ఇప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆపరేటర్ నిఖిల్ వీరికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే ఈ ముగ్గురు ఒకేసారి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలంగా మారింది. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.