Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్‌ చరిత్రలో ఏకైక మొనగాడు

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్‌.. క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే.

author-image
By srinivas
New Update
Corbin Bosch

క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కోర్బిన్ బాష్‌

SA vs PAK: అరంగేట్రంలోనే క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు 30 ఏళ్ల దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్‌.  పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో 122 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. బంతి, బ్యాట్‌తో ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు (4/63) కీలక వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విచిరిన కోర్బిన్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌లో దిగి 81 పరుగులు చేసి అదరగొట్టాడు.

అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్..

అంతేకాదు 93 బంతులాడిని బాష్.. 15 ఫోర్లు బాది నాటౌట్ గా నిలవడం విశేషం. కాగా క్రికెట్‌ చరిత్రలోనే నాలుగు వికెట్లు తీసి 81 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ గానూ నిలిచాడు. ఇక బాష్ కంటే ముందు ఈ రికార్డు మిలన్ రత్నాయకే (72) పేరిట ఉండేది. ఇక టెస్టుల్లో అరంగేట్రంలోనే 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు వీరే. కోర్బిన్ బాష్, దక్షిణాఫ్రికా - (81* ; 92 బంతుల్లో) 2024 పాకిస్థాన్‌పై. 

ఇది కూడా చదవండి: AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు!


మిలన్ రత్నాయకే,  శ్రీలంక  (72; 135 బంతుల్లో) 2024 ఇంగ్లాండ్‌పై. బల్వీందర్ సంధు, భారత్ - (71; 88 బంతుల్లో) - 1983 పాకిస్థాన్‌పై. డారెన్ గోఫ్, ఇంగ్లాండ్ - (65;126 బంతుల్లో) 1994 న్యూజిలాండ్‌పై. జోండేకి (దక్షిణాఫ్రికా) - (59; 128 బంతుల్లో) 2003 ఇంగ్లాండ్‌పై తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా 301 పరుగులు చేయగా 90 పరుగుల ఆధిక్యం సాధించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు