Prajwal Revanna : 2వేల మందిపై రే*ప్.. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన దారుణాలు ఇవే!

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్న 2 వేలకు పైగా వీడియో క్లిప్‌లు ఉన్న పెన్‌డ్రైవ్‌లు కర్ణాటకలోని హాసన్, పరిసర ప్రాంతాలలో లభ్యం అయ్యాయి.

New Update
2k-videos

అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు  ఆయన్ను దోషిగా నిర్ధారించింది. అయితే ఇంకా శిక్షను ఖరారు చేయలేదు.  రేపు అంటే 2025 ఆగస్టు 02వ తేదీన కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. మొత్తం ప్రజ్వల్ రేవణ్ణ మీద నాలుగు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించినవే. దీనిని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం కేసుల దర్యాప్తు కోసంఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది.

ఈ నాలుగు కేసులలో ఒకదానిలో ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్‌ను దోషిగా నిర్ధారించింది. మిగిలిన మూడు కేసులలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్న 2 వేలకు పైగా వీడియో క్లిప్‌లు ఉన్న పెన్‌డ్రైవ్‌లు కర్ణాటకలోని హాసన్, పరిసర ప్రాంతాలలో లభ్యం అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లలో అనేకమంది మహిళలతో ప్రజ్వల్ బలవంతగా బెదిరించి లైంగికంగా వేధించినట్లుగా  తెలుస్తోంది.   ఈ వీడియోలను స్వయంగా ప్రజ్వల్ రేవణ్ణే చిత్రీకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోల లీకేజీ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read :  ధర్మస్థల వివాదం.. ఎవరికీ తెలియని 6 షాకింగ్ విషయాలు!

రెండుసార్లు అత్యాచారం చేశాడని

అయితే ఈ కేసుల్లో బాధితుల్లో ఒక మహిళ తనపై 2021లో ప్రజ్వల్ రేవణ్ణ రెండుసార్లు అత్యాచారం చేశాడని, ఆ ఘటనలను ప్రజ్వల్ తన ఫోన్‌లో రికార్డు చేశాడని ఆరోపించింది. ఒకసారి హసన్‌లోని ఫామ్‌హౌస్‌లో, మరోసారి బెంగుళూరులోని తన ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా ఈ చర్యను ఆయన తన మొబైల్‌లో రికార్డ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రజ్వల్ రేవణ్ణ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించారు. బాధిత మహిళను కిడ్నాప్ చేసేరనే ఆరోపనలపై వారిపై కూడా కేసు నమోదు కాగా అరెస్ట్ అయ్యారు.  ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.

ప్రజ్వల్ రేవణ్ణ పొలిటికల్ కెరీర్

మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మనవడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కుమారుడిగా ప్రజ్వల్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయననుజనతాదళ్ (సెక్యులర్) (JD(S))  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో భారత్ లో  అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటు సభ్యులలో ఆయన ఒకరు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు ఆయన రాజకీయ జీవితం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొత్తానికి ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  మిగితా మూడు కేసుల్లో అతనికి కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్నది చూడాలి. 

Also Read : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్

telugu-news | karnataka | bengaluru | prajwal-revanna | latest-telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు