/rtv/media/media_files/2025/09/08/child-2025-09-08-16-46-29.jpg)
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మోరాదాబాద్‌లో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవానంతర మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ 23 ఏళ్ల మహిళ తన 15 రోజుల పసికందును నిద్రపోయే ముందు ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది. ఏడుపులతో అప్రమత్తమైన అమ్మమ్మ ఆ పసికందును రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన చుట్టుపక్కల వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తల్లి తన భర్త, అత్తమామలతో కలిసి మొరాదాబాద్‌లోని జబ్బర్ కాలనీలో నివసించింది. సెప్టెంబర్ 5న పసికందును వంటగదికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచింది. వెంటనే, ఆమె తన గదికి తిరిగి వచ్చి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత, ఆ పసికందు ఏడుపులు విన్న అమ్మమ్మ వెంటనే ఆ పసికందును అందులో నుంచి బయటకు తీసింది. వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పసికందుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించారు.
In a shocking incident in Moradabad district, Uttar Pradesh, a 15-day-old newborn was allegedly placed in a freezer by his mother while she went to sleep on Friday, leaving the community horrified.#UttarPradesh#Postpartum#Moradabadhttps://t.co/nMchiZXsmJ
— News18 (@CNNnews18) September 8, 2025
ప్రసవం తర్వాత తలెత్తే అరుదైన వ్యాధి
చివరికి పసికందు తల్లిని మానసిక సంరక్షణలో చేర్చారు, అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవానంతరం పోస్ట్‌పార్టమ్ సైకోసిస్(Postpartum Psychosis) ఉన్నట్లుగా నిర్ధారించారు, ఇది ప్రసవం తర్వాత తలెత్తే అరుదైన వ్యాధి అని కానీ తీవ్రమైన మానసిక రుగ్మత కాదన్నారు. సైకోసిస్ అనేది చాలా అరుదు - ప్రతి 1,000 ప్రసవాలకు ఒక్కరు లేదా ఇద్దరు మహిళలను ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 20 శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధి వ్యాప్తి 22 శాతం ఉందని తేలింది, అయినప్పటికీ అవగాహన చాలా తక్కువగా ఉంది. ఒక్కొసారి ఈ రుగ్మత ఉన్న మహిళలు తమకు లేదా తమ బిడ్డకు హాని కలిగించే ఆలోచనలు, ప్రవర్తనలు కలిగి ఉండవచ్చు.
Also Read : Vice-President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDA, INDIA కూటముల బలం ఎంత?