Andhra King Taluka: ''పప్పీ షేమ్''.. ఆంధ్ర తాలూక నుంచి రామ్ మాస్ బీట్ అదిరింది! సాంగ్ చూశారా

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలుక నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ''పప్పీ షేమ్''..అంటూ మంచి యూత్ ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ  పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update

Andhra King Taluka:  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలుక నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ''పప్పీ షేమ్''..అంటూ మంచి యూత్ ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ  పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మాస్, పెప్పీ బీట్స్ కి రామ్ ఎనర్జిటిక్ స్టెప్పులు అదిరిపోయాయి. సాంగ్ మధ్యలో డైలాగ్స్ రావడం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ పోతినేని స్వయంగా పాడారు. ఈ సినిమాలో రామ్ పాడిన రెండవ పాట ఇది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ ఉపేంద్ర అభిమానిగా కనిపించబోతున్నారు. "A Biopic of Fan"  అనే ట్యాగ్ లైన్ తో ఇది రూపొందుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్స్ లో విడుదల కానుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను తెరకెక్కించిన పి. మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హీరో పట్ల అభిమానికి ఉన్న ప్రేమను, అభిమానుల ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు డైరెక్టర్. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ తో పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఆంధ్ర తాలూకా కింగ్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ఈ సినిమతో రామ్ తొలిసారి లిరిసిస్ట్ గా,  సింగర్ గా మారాడు. నువ్వుంటే చాలు, పప్పీ షేమ్ రెండు పాటలను రామ్ స్వయంగా పాడారు. 

Also Read:Andhra King Taluka: ''పప్పీ షేమ్''.. ఆంధ్ర తాలూక నుంచి రామ్ మాస్ బీట్ అదిరింది! సాంగ్ చూశారా

Advertisment
తాజా కథనాలు