/rtv/media/media_files/2025/08/19/mumbai-mono-metro-2025-08-19-21-06-49.jpg)
MUMBAI MONO METRO
MUMBAI MONO METRO : ముంబయిని వానలు ముంచేత్తాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ముంబై జలమయమైంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ముంబయితో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది.భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాక, అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
#WATCH | Mumbai Monorail stuck on elevated track due to power supply issue amid heavy rain; rescue underway.#ViralVideo#Trending#monorailpic.twitter.com/6vjfiKHH6o
— TIMES NOW (@TimesNow) August 19, 2025
Also Read:Heavy Rains: ముంబయికి రెడ్ అలెర్ట్ .. 250 కి పైగా విమానాలు రద్దు?
ఈ వర్షాల మూలంగా మోనో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మోనో మెట్రో రైలు మొరాయించింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మోనో మెట్రో రైలు ఆగిపోయింది. చెంబూర్, వడాలా మధ్య రైలు నిలిచిపోయింది. దీంతోదాదాపు గంట పాటు ట్రైన్‌లోనే ప్రయాణికుల అవస్థలు పడ్డారు. వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది. సిబ్బంది క్రేన్ సాయంతో ప్రయాణికులకు కిందకు దింపారు.భారీ వర్షాలతో ముంబైలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఈ కారణాంగానే రైలు ఆగిపోయింది. కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు.
Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
ముఖ్యంగా, ముంబైలో వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి లేదా నిలిచిపోతున్నాయి. వడాలా, చెంబూర్ ల మధ్య రైల్వే లైన్లలో నీరు నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తింది, దీనివల్ల హార్బర్ లైన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా, ముఖ్యంగా చునాభట్టి, గురు తేజ్ బహదూర్ నగర్, వడాలా రోడ్ స్టేషన్ల మధ్య నీరు నిలిచిపోవడంతో రైళ్లు నిలిచిపోయాయి. కుర్లా,సియోన్ స్టేషన్ల మధ్య కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ముంబైలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు, ప్రయాణికులు స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముంబైలోని వాడాలా ప్రాంతంలోని భక్తి పార్క్ సమీపంలో విద్యుత్తు అంతరాయం కారణంగా ఈరోజు మోనోరైలు సేవలు నిలిచిపోయాయి, దీంతో పలువురు ప్రయాణికులు రైలులోనే చిక్కుకుపోయారు. కాగా ఇలా విద్యుత్ అంతరాయంతో మోనో మెట్రో రైలు సేవలు నిలిచి పోవడం ఇది తొలిసారి కాదని పలువురు చెప్తున్నారు. గతంలోనూ ఇలాగే జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. కాగా, దేశంలో మొట్టమొదటి ముంబై మోనోరైలు సర్వీసు, గత ఏడాది ఫిబ్రవరిలో వడాలా, చెంబూర్ మధ్య ప్రారంభమైంది.