J&K Tragedy: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది

జమ్మూ, కాశ్మీర్ లో ఇంకా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. దీంతో జీలం నది ప్రవాహం ప్రమాద స్థాయిని చేరుకుంది. మరోవైపు వైష్ణోదేవి యాత్రలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 35 కు చేరుకుంది. 

New Update
jeelam

J&K Floods

జమ్మూ, కాశ్మీర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే వైష్ణోదేవి యాత్ర పెను విషాదం మిగుల్చింది. అక్కడ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి తోడు కుండపోతగా పడుతున్న వర్షం అన్ని పనులకూ అంతరాయం కలిగిస్తోంది. రియాసి జిల్లాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈ ఘటన అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది.ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని...కానీ మూడు రోజులుగా కుండపోత వర్షాలు పడడంతో సహాయక చర్యలు చేయడం కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు. 

డేంజర్ లో జీలంనది

జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడ కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. మరోవైపు ఆగకుండా పడుతున్న వర్షాల కారణంగా జీలం నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో చాలా మంది తాము ఉంటున్న నివాస ప్రాంతాలను వదిలి వెళ్ళాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, NDRF, SDRF, భారత సైన్యం మరియు స్థానిక స్వచ్ఛంద సేవకుల సంయుక్త బృందాలు సహాయక చర్యలను చేస్తున్నారు. 

రికార్డు వర్షపాతం..

జమ్మూ కాశ్మీర్ లో 1973 తర్వాత మళ్ళీ ఇప్పుడే రికార్డు వర్షపాతం నమోదైంది. అప్పుడు 272.6 మి.మీ వర్షపాతం కురిసింది. దాని బీట్ చేస్తూ ఒక్క బుధవారం మాత్రం ఇక్కడ 296.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉదంపూర్ లో ఇంత కంటే ఎక్కువగా...ఎప్పుడూ చూడనంతగా 629.4 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. 2019 జూలైలో నమోదైన వర్షపాతం కంటే రెట్టింపని అంటున్నారు.  

పరిస్థితి దారుణంగా ఉంది- సీఎం ఒమర్

మరోవైపు జమ్మూ, కాశ్మీర్ లో భారీ వర్షం కారణంగా చాలా సేవలు నిలిచిపోయాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కమ్యూనికేషన్ దాదాపు నిలిచిపోయిందని ఆయన తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అక్కడ ప్రజలు టెలికాం బ్లాక్ అవుట్ ను ఎదుర్కొంటున్నారని వివరించారు. దీంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా అయిపోయారని ఒమర్ చెప్పారు. వంతెనలు కూలిపోయాయి, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు