CPI Narayana : అందాల భామలను చూసి మంత్రులు సొల్లు కార్చుకుంటున్నరు : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రులంతా అందాలభామల చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని, కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచమైనా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని విమర్శించారు.

New Update
CPI Narayana

CPI Narayana

CPI Narayana : తెలంగాణ మంత్రులంతా అందాలభామల చుట్టూ  సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని, కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచమైనా అని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని విమర్శించారు.హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు కానీ.. అందాల భామల కోసం కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని.. కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా, మోడీ డీ ఆక్టివ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ డీయాక్టివ్ ప్రధానిగా ఉండటం దురదృష్టకరమన్నారు. దేశానికి ప్రధాని మోడీనా లేక ట్రంప్ నా అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 

Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

అమెరికా విధానాన్ని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని నారాయణ ప్రశ్నించారు. యుద్ధం మొదలు పెట్టి  ట్రంప్ యుద్ధం అపమంటే ఆపుతారు, కానీ అమెరికా ఆడుతున్న దోపిడి పైశాచికత్వాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోదీ సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోదీ మాత్రం ట్రంప్‌కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. ఇదేనా మీ దేశ భక్తి..?  అని నారాయణ ప్రశ్నించారు.తల్లి దండ్రులు కష్టపడి మంచి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని, వారు అక్కడి నుంచి పంపించే డబ్బుపైనా 5 శాతం టాక్స్‌ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్‌పై అమెరికా పైశాచికానందం పొందుతుందని విమర్శించారు. అమెరికా విధానాన్ని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు.  

 Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు