WhatsApp: 85 లక్షల వాట్సప్‌ అకౌంట్స్ బ్లాక్!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్‌ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది.

whatsapp1
New Update

WhatsApp : మెటా సంస్థ భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చింది. తమ ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులపై బ్యాన్ విధించింది. మొత్తం 85 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటన విడుదల చేసింది. ఐటీ రూల్స్‌ 2021 ఉల్లఘించినందుకు, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబర్ ఒక నెలలో ఏకంగా 85 లక్షల ఖాతాలను మెటా సంస్థ బ్యాన్ చేయడం ఇదే తొలిసారి. అయితే.. వీటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొంది. అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Also Read :  'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!

మొత్తం  600 మిలియన్లకుపైగా....

మెటా సంస్థకు భారత దేశంలోనే ఎక్కువ మంది వాట్సాప్ వినియోగ దారులు ఉన్నారు. ఒక భారత్ లోనే దాదాపు 600 మిలియన్ల మంది వాట్సాప్ వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కేంద్రం ఇటీవల సోషల్ మీడియా యాప్స్ పై కొన్ని నిబంధనలను పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం నేరాలకు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, సైబర్ క్రైమ్స్ ఆపేందుకు వంటి అనేక అంశాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మెటా సంస్థ కూడా ఈ మేరకు కొన్ని నిబంధనలు పెట్టింది. 2021లో కొత్త నిబంధనలు వాట్సాప్ ప్రవేశపెట్టింది.  

Also Read :  జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

ఆగస్టులో కూడా...

తన ప్లాట్‌ఫామ్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వాట్సప్‌ ఈ తరహా చర్యలు తీసుకోవడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా అనేక ఖాతాలపై నిషేధం విధించింది. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేతకు బల్క్‌, స్పామ్‌ మెసేజులు పంపే యూజర్లపై చర్యలకు చేసేందుకు సిద్ధమైంది. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా వాట్సప్‌ వరుసగా  చర్యలు తీసుకుంటోంది. కాగా ఆగస్టులో  84.58లక్షల ఖాతాలపై వాట్సప్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

Also Read : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 10 తోనే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

Also Read :  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్

#whatsapp #meta #whatsapp-ban
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe