Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 10 తోనే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

రిలయన్స్ జియో తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 999 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు, 5G డేటా లభిస్తుంది. ఇలా చూస్తే.. రోజుకు రూ. 10 చొప్పున మాత్రమే పడుతుంది. 

New Update
jio

ప్రముఖ టెలికాం సంస్థలైన రియలన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల కాలంలో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను అధికంగా పెంచేశాయి. ముందుగా జియో తమ టారిఫ్స్ అధికంగా పెంచగా.. ఆ తర్వాత ఎయిర్‌టెల్ అండ్ విఐ పెంచాయి. దాదాపు 25 శాతం వరకు పెరగడంతో కస్టమర్లు ఖంగుతిన్నారు. దీంతో తప్పనిసరి అయినవారు వాటిల్లోనే కొనసాగుతుండగా.. మరికొందరు మాత్రం వెంటనే పోర్ట్ అయిపోవడం మొదలు పెట్టారు. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ఇక ఇదే అదునుగా భావించిన ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వాటికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంది. అతి తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా పలు ఆఫర్లు కూడా అందించడం మొదలు పెట్టింది. మిగతా నెట్‌వర్క్‌లు నెల రోజుల వ్యాలిడిటీకి దాదాపు రూ.300 వసూలు చేయగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం రూ.100 నుంచి రూ.200 మధ్యలో అందించింది. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు షిఫ్ట్ అయిపోయారు. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్, విఐ కంపెనీలు భారీ స్థాయిలో వినియోగదారులను కోల్పోయాయి. ఇక ఇప్పుడు జియో అప్రమత్తమైంది. తమ కస్టమర్లను తిరిగి పొందేందుకు కొత్త కొత్త ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే జియో అందిస్తున్న ఒక ప్లాన్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అదే రూ.98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. 

రోజుకు రూ. 10 మాత్రమే

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ

అత్యంత ఫీచర్ రిచ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వారికి 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ మంచి ఛాన్స్ అని చెప్పాలి. రూ. 999 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా డైలీ 2GB డేటా వస్తుంది.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందొచ్చు. మరీ ముఖ్యంగా 5G డేటా సౌలభ్యం కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్స్ యాక్సెస్ కూడా పొందుతారు. దీని ప్రకారం చూస్తే.. ఇక్కడ రోజుకు రూ. 10 చొప్పున మాత్రమే పడుతుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు