/rtv/media/media_files/2024/11/03/lk1jY07H8Y2V6fCOpkak.jpg)
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం 'అమరన్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
Also Read : ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన..
#Amaran has collected 100 crores worldwide and 50 crores in Tamil Nadu in first 3 days 🔥💥 pic.twitter.com/kDxpYadepE
— Cinetrends (@Cinetrendssk) November 3, 2024
Also Read : స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి
అప్పుడే వంద కోట్ల క్లబ్ లో..
ఇక తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మరో అరుదైన ఘనత సాధించింది. 'అమరన్' మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం తమిళనాడులోనే రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన 'అమరన్'.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read : ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆయన నటించిన గత సినిమాలు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు 'డాక్టర్' 25 రోజులు, 'డాన్' 12రోజులు పట్టగా.. 'అమరన్' మూవీ మాత్రం మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్ లో చేరడం విశేషం. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.
Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య