అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. By B Aravind 03 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మరో రెండ్రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తానే అధ్యక్షునిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని.. క్రిమినల్ నేరాలకు పాల్పడే నేరస్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. Also Read: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పన్నులు తగ్గిస్తా కమలా హారిస్ ఓటమితోనే అమెరికా రక్షణ సాధ్యమవుతుందని అన్నారు. తాను అధ్యక్షునిగా గెలిస్తే పన్నులు తగ్గిస్తానని.. వేలాది అమెరికన్ కంపెనీలను వెక్కి తీసుకొచ్చి కార్మికుల జీతాలు పెరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. హరీస్ అధికారంలోకి వస్తే అమెరికాలో అభివృద్ధికి భంగం వాటిల్లుతుందని.. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని విమర్శలు చేశారు. దీనివల్ల అమెరికన్లకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని ప్రజలను హెచ్చరించారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పలు ప్రాంతాల్లో ముందస్తు ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఓటింగ్ ద్వారా దాదాపు 6.1 కోట్ల మంది ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్, హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. జార్జియాలో హారిస్‌కు 47 శాతం మద్దతు ఉండగా.. ట్రంప్‌నకు 48 శాతం ఉంది. ఇక నార్త్ కరోలినాలో ట్రంప్‌నకు 47 శాతం మద్దతు ఉండగా.. హారిస్‌కు 48 శాతం ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. 2008 నుంచి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న ఒబామాకు నార్త్ కరోలినా కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత రిపబ్లికన్ అభ్యర్థలకు మద్దతిస్తున్నారు. Also Read: హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చిన ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై కేవలం అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా కొత్త అధ్యక్షునితో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారీ తీస్తాయే అనేది చర్చనీయమవుతోంది. #trump #usa #usa-elections #kamala-harries #donald-trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి