/rtv/media/media_files/2025/05/29/k0WFvHvqmf1ojFGhvLYR.jpg)
Maoist Key Leader Hidma Arrested
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా అరెస్టుతో ఆ వార్తలు అవాస్తవం అని తేలింది. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న హిడ్మా గురించి చాలామందికి తెలియదు. వాళ్ల క్యాడర్‌లో ఉన్నవాళ్లలో కూడా చాలామందికి తెలియదు.
Also Read: రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
Maoist Key Leader Hidma Arrest
గతంలో హిడ్మాను కేంద్ర కమిటిలోకి తీసుకురావడంపై మావోయిస్టుల పార్టీలో విభేధాలు వచ్చాయి. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్ర కమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడాన్ని మావోయిస్టు మద్దతుదారులు విమర్శలు చేశారు. ఇలా చేయడం హింసను ప్రోత్సహించడమే అవుతుందని ధ్వజమెత్తారు.
Also Read: ఉన్నత చదువుల కోసం అమెరికాకు బదులుగా ఈ దేశాలే బెస్ట్
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలేసి హింసామార్గాన్ని ఎంచుకుందని హిడ్మాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.హిడ్మా హింస భయంకరంగా ఉంటుందని పార్టీ సానుభూతిపారులు చెబుతున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడ్డాడని పెద్ద చర్చలే జరిగాయి. హిడ్మాకు భారీ భద్రత ఉంటుందని.. దాదాపు 10 మంది వరకు రాత్రింభవళ్లు ఆయనకు పహరా కాస్తారని మాజీ మావోయిస్టులు అంటున్నారు.
Also Read: పీవోకేలో భద్రతా దళాలకు, టీటీపీ కు మధ్య ఎదురు కాల్పులు..
ఇటీవల కూడా మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రామ పంచాయతీ పథకంలో సాధించిన మరో విజయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయని, ఈ నేపథ్యంలో మిగతా వారంతా లొంగిపోతున్నట్లు తెలిపారు.
Also Read : కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
maoist | hidma in karregutta | telugu-news
 Follow Us