Crime: కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. బెయిల్ మంజూరు చేయలేమంటూ అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

New Update
Supreme Court

Supreme Court

ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో దోషిగా తేలిన అతడికి శిక్ష ఖరారైంది. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. '' ఏడేళ్ల చిన్నారికి తండ్రి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేశాడు. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

Man Becomes Beast After Drinking

ఏ తండ్రి కూడా తమ కూతుర్లపై ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడరు. ఆ బాలికకు సొంత తండ్రిపై అబద్ధపు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఏముంది ?. ఆ చిన్నారి ఎంతో బాధను అనుభవించింది. మద్యం తాగాక మనిషి మృగంలా తయారవుతాడు. అతడికి బెయిల్‌ ఇవ్వడం కుదరదు. ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి శిక్ష నుంచి ఎలా మినహాయింపు కల్పించాలని'' జస్టిస్‌ బీవీ. నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం నిలదీసింది. చివరకి దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. 

Also Read: పాక్‌ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్‌పై మరోసారి విద్వేష ప్రసంగం

ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్డియాలజిస్ట్ అయిన ఓ వ్యక్తి తన భార్యతో విడిపోయి వాణాసిలో ఉంటున్నాడు. అయితే 2018, మార్చి 23న అతడు తన ఏడేళ్ల కూతురిని ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీకి తీసుకెళ్లాడు. ఆ తర్వత మార్చి 30న తన భార్యకు ఫోన్‌ చేసి కూతురును తీసుకుపోవాలని చెప్పాడు. అనంతరం ఆ చిన్నారి తనకు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పుకుంది. నాన్న చెడ్డవాడని.. నన్ను అభ్యంతరకరంగా తాకాడని చెప్పింది. దీంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కూతురిపై భర్త లైంగిక దాడికి పాల్పడ్డట్లు పేర్కొంది. దీంతో పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు. చివరికీ బెయిల్‌ పిటిషన్ పెట్టుకున్న అతడికి చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరును రద్దు చేసింది. 

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

rtv-news | Supreme Court | rape

Advertisment
Advertisment
తాజా కథనాలు