/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ - మారేడుబాక అడవుల్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక మావోయిస్టు నేత మృతి చెందారు. తెలంగాణ మావోయిస్టు కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియస్ దామోదర్.. భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయనతో పాటు మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించింది.
Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
అయితే బడే చొక్కా రావుపై గతంలో రూ.50 లక్షల రివార్డు ఉంది. ఇతని స్వస్థలం ములుగా జిల్లాలోని కాల్పపల్లి. అంతకుముందు తెలంగాణ తెలంగాణ మావోయిస్టు కమిటీ సెక్రటరీగా హరిభూషన్ ఉండేవారు. అయితే కరోనా వల్ల అతను మరణించిన తర్వాత.. ఆ బాధ్యతలు బడే చొక్కారావు స్వీకరించారు.
Also Read: పాపం తిరుపతమ్మ.. చికెన్, గారె గొంతులో ఇరుక్కొని.. కనుమ రోజు ఖమ్మంలో విషాదం..!
ఇదిలాఉండగా.. గురువారం ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత భద్రతా బలగాలు మావోయిస్టుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో సోరంగల్ దేశవాళీ రాకెట్ లాంటర్లు, మందుగుండి సామగ్రి, ఇతర పెద్దఎత్తున యంత్రాలు, అలాగే విద్యుత్ లైన్‌ను నిర్మించే సిల్వర్ వైర్లు కూడా లభించగా వాటిని తీసుకున్నారు.
Also Read: ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్‌బొల్లా ఏం చెప్పిందంటే ?