TG Crime: పాపం తిరుపతమ్మ.. చికెన్, గారె గొంతులో ఇరుక్కొని.. కనుమ రోజు ఖమ్మంలో విషాదం..!

ఖమ్మం జిల్లా తల్లాడలో గొంతులో గారెముక్క ఇరుక్కుని ఊపిరి ఆడక వృద్ధురాలు మొక్కా తిరుపతమ్మ (80) మృతి చెందారు. కనుమ పండుగ పూట ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తె కమలమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
sycho Medchal

tirupathamma died khammam Photograph

TG Crime: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో గారె ముక్క ఇరుక్కుని ఊపిరి ఆడక 80 ఏళ్ల వృద్ధురాలు మొక్కా తిరుపతమ్మ మృతి చెందారు. కనుమ పండుగ పూట ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తల్లాడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంటిని ఆనుకుని ఉన్న ఓ గదిలో ఆశ్రయం ఉంటూ తిరుపతమ్మ ఒంటరి జీవనం గడుపుతోంది. 

ఇది కూడా చదవండి: ఎండు ద్రాక్ష తింటే మీరే సూపర్‌ మ్యాన్‌..చాలా ప్రయోజనాలు

చికెన్, గారె గొంతులో ఇరుక్కుని..

ఇంటి జాగా అమ్మకం విషయంలో తిరుపతమ్మ కుమారులు రామకృష్ణ, శ్రీనివాస్‌కు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 15వ తేదీన పండుగను పురస్కరించుకుని తల్లి తిరుపతమ్మకు చికెన్, గారెలు చిన్నకొడుకు శ్రీనివాస్ పంపించాడు. చికెన్, గారె గొంతులో ఇరుక్కుని ప్రమాదవశాత్తు ఊపిరాడక కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లి తిరుపతమ్మ చావుకు నువ్వంటే నువ్వే కారణమంటూ పరస్పరం గొడవకు కుమారులు రామకృష్ణ, శ్రీనివాస్ దిగారు. 

ఇది కూడా చదవండి: చీర కట్టుకుంటే స్కిన్ క్యాన్సర్‌..పరిశోధనల్లో సంచలన వాస్తవాలు

వృద్ధురాలి గారెలను తింటుండగా గొంతులో ఇరుక్కునిపోయిందా..? ఊపిరాడక స్పృహ‌త‌ప్పి పడిపోయి మరణించటంపై పెద్ద కుమారుడు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతమ్మ మృతిపై దర్యాప్తు చేపట్టినట్టు తల్లాడ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు వెల్లడించారు. అయితే గారె ముక్క గొంతుకు అడ్డుపడి చనిపోయిందా..? మరో కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెప్పారు. మృతురాలు తిరుపతమ్మ కుమార్తె కమలమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంకు పోస్టుమార్టం నిర్వహించారు.  పండుగ పూల జరగటంతోపాటు కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఖమ్మం జిల్లాలో విషాదం.. చెరువులో దూకి వృద్ధ దంపతులు..

Advertisment
తాజా కథనాలు