Madhya Pradesh Crime : మంచి చేస్తే అరెస్ట్.. 395 రోజులు జైల్లోనే ఉంచారు!

వందమంది దోషులు తప్పించుకున్నా ఓ నిర్దోషికి మాత్రం మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ సిద్ధాంతం. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి చేయని తప్పుకు ఏకంగా 395 రోజులపాటు జైలుశిక్షను అనుభవించాడు.

New Update
madhya-pradesh-man

వందమంది దోషులు తప్పించుకున్నా ఓ నిర్దోషికి మాత్రం మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ సిద్ధాంతం. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి చేయని తప్పుకు ఏకంగా 395 రోజులపాటు జైలుశిక్షను అనుభవించాడు. చివరకు కోర్టు ఓ లాయర్ ను  నియమించగా అతను నిర్దోషి అని తేలింది. ఇంతకు ఏం జరిగిందంటే..  2024 జూన్ 16న, అతను తన పక్కింటి మహిళ ఆశా యాదవ్ అనారోగ్యంతో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను జాయిన్ చేసి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు సాయంత్రం ఆ మహిళ చనిపోయింది. అయితే మరుసటి రోజు ఎలాంటి  దర్యాప్తు లేకుండా, పోస్ట్‌మార్టం లేకుండా ఆధారాలు లేకుండా, గౌతమ్ నగర్ పోలీసులు రాజేష్‌ను అరెస్టు చేశారు. 

Also Read :  ‘నైసార్‌’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16

హత్య చేశాడన్న కేసులో

పోలీసులు అతన్ని 9 రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కనీసం అతని కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదు  రాజేష్‌ ఆమె హత్య చేశాడన్న కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.  డబ్బులు లేకా తాను లాయర్ ను పెట్టుకోలేదని తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. మానవత్వంతోనే పక్కింటి మహిళకు సాయం చేశాను. హత్య కేసని  పోలీసులు నన్ను తీసుకెళ్లి విచారించారు, మరుసటి రోజు నన్ను అరెస్టు చేశారు. విచారణలో ఆమెను చికిత్స కోసం తీసుకెళ్లానని చెప్పాను. నన్ను తొమ్మిది రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత నేరుగా జైలుకు పంపారు. న్యాయవాదిని నియమించుకోవడానికి నా దగ్గర డబ్బు లేవని తెలిపాడు. 

ఇప్పుడు నేను 13 నెలల అద్దె చెల్లించాలి. ఎవరూ నాకు పని కూడా ఇవ్వడం లేదు. అందరూ నేను జైలు నుండి వచ్చానని అంటున్నారు. నేను నిర్దోషిని, అయినప్పటికీ నేను కటకటాల వెనుక ఉండిపోయాను. నాకు భూమి లేదు, తల్లిదండ్రులు లేరు, ఏమీ లేదు... నాపై కూడా పరువు నష్టం జరిగిందని రాజేష్ వాపోయాడు. ఇప్పటికే తన సొంత కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు  రాజేష్ . అతని అరెస్ట్ విషయం కూడా సోదరి కమలేష్‌ కు తొమ్మిది రోజుల తర్వాత సమాచారం అందింది. కోర్టు నియమించిన న్యాయ సహాయ న్యాయవాది రీనా వర్మ  ద్వారా  రాజేష్‌ను నిర్దోషిగా రిలీజ్ అయ్యాడు.  లాయర్ రీనా వర్మ మాట్లాడుతూ..  అతని దగ్గర న్యాయవాదిని నియమించుకోవడానికి డబ్బు లేదు. దీంతో కోర్టు నన్ను నియమించింది,న్యాయం జరిగేలా నేను పూర్తి నిజాయితీతో పని చేస్తానని ఆమె అన్నారు. 

NCRB ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత జైళ్లలో 75.8 శాతం మంది ఖైదీలు విచారణలో లేనివారే అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఖైదీకి సగటు వార్షిక ఖర్చు రూ. 27,865.  జైలు జనాభా సామర్థ్యం 164 శాతం. మధ్యప్రదేశ్‌లోని 24 శాతం ఖైదీలు ఒకటి నుండి మూడు సంవత్సరాలుగా విచారణలో లేని ఖైదీలుగా ఉన్నారు.

Also read :  pahalgam terror attack: రహస్య టన్నెల్‌ మూసివేత...సైన్యం చేతికి చిక్కిన  పహల్గాం టెర్రరిస్టులు

jail | india | Madhya Pradesh | national news in Telugu | latest-telugu-news | telugu-news | telugu crime news

Advertisment
తాజా కథనాలు