/rtv/media/media_files/2025/07/30/murder-wife-mother-in-law-2025-07-30-20-33-11.jpg)
Murder Wife, Mother In Law
Murder Wife, Mother In Law : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్ది ఆధునికతవైపు ప్రయాణించాల్సిన మనుషులు ఇంకా మూర్ఖత్వంగానే ప్రవర్తిస్తున్నారు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో వారి మృతదేహాలను పాతిపెట్టాడు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. అంతటితో ఆగకుండా తన భార్య, అత్త కొంతకాలంగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, ఆ నేరం ఎంతో కాలం దాగలేదు. కేసు పరిశీలనలో భాగంగా ఆ వ్యక్తి తోటలో పరిశీలిస్తుండగా కొత్తగా వెలసిన అరటి చెట్లపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
వివరాల ప్రకారం.. దేబాషిష్ పాత్ర, 23 ఏళ్ల సోనాలి దలాల్ భార్యాభర్తలు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటతో భర్తతో గొడవ పడిన సోనాలి కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇదిలా ఉండగా, జూలై 12న సోనాలి తల్లి సుమతి తన కుమార్తె, మనవడ్ని తీసుకుని అల్లుని వద్దకు వచ్చింది. గొడవలు సాధారణమని ఇద్దరూ కలిసి ఉండాలని చెప్తూ కూతురు కాపురం నిలబెట్టేందుకు ఆమె ప్రయత్నించింది. వారి కాపురం కుదుటపడేందుకోసం కొంతకాలం అక్కడే ఉంది. అయితే జూలై 19న ఆ ముగ్గురి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కోపం పెంచుకున్న దేబాషిష్ నిద్రిస్తున్న భార్య సోనాలి, ఆమె తల్లి, అత్తైన సుమతి తలలపై బండరాళ్లతో మోది వారిని హత్య చేశాడు. అదే సమయంలో బయట వర్షం పడుతుండటంతో ఆ రాత్రి వేళ నిమ్మకాయల తోటలో ఒక గొయ్యి తీసి మృతదేహాలను అందులో పాతిపెట్టారు. శవాలను పాతిన చోట అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు.
ఇది కూడా చూడండి:TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మరునాడు ఏమి తెలియనట్లు ఉదయాన్నే లేచి దేబాషిష్ స్థానికంగా ఉన్న పాత్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య సోనాలి, అత్త సుమతి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. గొడవ విషయం చెప్పడంతో పాటు వారిద్దరూ తనకు కుమారుడ్ని అప్పగించి ఆ తర్వాత ఊరి నుంచి వెళ్లినట్లు పోలీసులకు, అత్తగారి బంధువులకు చెప్పాడు. అయితే అతని మొఖంలో వారు కనిపించడం లేదన్న ఆందోళన ఎంతమాత్రం కనిపించలేదు. తన కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే భార్య అత్త కనిపించకపోవడం దేబాషిష్ నిమ్మ తోటలో కొత్తగా అరటి చెట్లు కనిపించడం స్థానికులకు అనుమానాన్ని పెంచింది. అక్కడ తవ్వినట్లుగా ఉండటంతో అతడిపై అనుమానం వచ్చింది. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో వారు దేబాషిష్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. భార్య, అత్తను హత్య చేసి అక్కడ పాతిపెట్టినట్లు వెల్లడించాడు. అయితే అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడ అరటి చెట్లు నాటినట్లు దేబాషిష్ చెప్పాడు. దీంతో అక్కడ తవ్వి కుళ్లిన మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అతడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందరూ గల్లంతు!