/rtv/media/media_files/2025/05/29/C7fwVd950tu9P3CImiZB.jpeg)
YCP Chief Jagan Will be Arrested by June 10, Says Vijaya Sai Reddy
వైసీపీ పార్టీకి అధికారం పోయినప్పటి నుంచి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. అయితే తాజాగా ఓ సంచలన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. మరోవైపు లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే సిట్ ఆధారాలు సంపాందించింది. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా తిరుపతిలో తన సన్నిహితులతో చెప్పారు.
Also Read: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం6
Also Read : మీ చర్మం నిగనిగలాడాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చుకోండి
YS Jagan Will Be Arrested On June 10
మే మొదటివారంలో విజయసాయి రెడ్డి తిరుపతిలో పర్యటించారు. అయితే ఆయన టీపీడీ నేతలను కలసిన వీడియోను వైసీపీ బయటపెట్టింది. దీంతో విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను నేను టార్గెట్ చేయాలని కావాలనే కొందరు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. దీంతో ఆ పార్టీ నేతలపై ఆయన రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ చీఫ్ జగన్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టవుతారని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!
Also Read : పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు
rtv-news | telugu-news