/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
4 Maoists Killed in Maharashtra
Encounter : మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. పండుగరోజు కూడా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వినాయక మండపాలల్లో భక్తి పాటలు హోరెత్తుతుంటే అడవుల్లో తుపాకుల మోత హోరెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి.
Also Read: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
గడ్చిరోలి , నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్, సీ-60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలు ఒకరినొకరు ఎదురుపడ్డారు. అప్రమత్తమైన మావోయిస్టుల కాల్పలకు దిగడంతో భద్రతానాయకులు సైతం ఎదురు కాల్పులు చేపట్టారు. ఇరువైపుల కొనసాగుతున్న ఎన్ కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ముగ్గురు మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
కాగా ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి ఒకఎస్ఎల్‌ఆర్ రైఫిల్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, 01.303 రైఫిల్ ఒకటి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.
Also Read: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది