విద్యార్థులు స్క్రీన్‌ టైమ్ తగ్గించాలి.. న్యూస్ పేపర్లు చదవాలి: ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

New Update
Classrooms To Start Day With Newspaper Readings To Cut Screen Time in Uttarpradesh

Classrooms To Start Day With Newspaper Readings To Cut Screen Time in Uttarpradesh

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చదివే ఆసక్తిని పెంచుతూ, డిజిటల్ స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలనే టార్గెట్‌తో యోగీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల కోసం పాఠశాలల లైబ్రరీల్లో ఇంగ్లీష్‌, హిందీ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు. 

Also Read: మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్‌.. కంపెనీ సీఈవోతో సహా ముగ్గురి అరెస్ట్‌

'' యూపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం పూట పాఠశాల ఆవరణలో కనీసం 10 నిమిషాల పాటు విద్యార్థులు న్యూస్‌ పేపర్లు చదివేలా సమయం కేటాయించాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు క్రీడా రంగాలకు సంబంధించిన వార్తలు విద్యార్థులు చదవాలి. న్యూస్‌ పేపర్లలో వచ్చిన అయిదు కఠినమైన పదాలను సెలక్ట్‌ చేసి నోటీసు బోర్డుపై పెట్టాలి. 'వర్డ్‌ ఆఫ్‌ ది డే' ప్రక్రియ ద్వారా విద్యార్థులకు కొత్త కొత్త పదాలు తెలుస్తాయి.  

Also Read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

న్యూస్ పేపర్ చదవడం వల్ల స్టూడెంట్స్‌కు జనరల్ నాలెడ్జ్, క్రిటికల్  థింకింగ్, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యా్ర్థులకు ఫేక్‌ వార్తలపై అవగాహన ఏర్పడుతుంది. కేవలం న్యూస్ పేపర్లు చదవడమే కాకుండా స్కూల్‌ నుంచి సొంతంగా  న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లను ప్రచూరించేలా స్డూడెంట్స్‌ను ప్రోత్సహించాలి. అంతేకాదు క్రాస్‌వర్డ్స్‌, సుడోకు లాంటి పోటీలు కూడా నిర్వహించాలి. వార్తా పత్రికల్లోని కటింగ్‌లు తీసుకొని స్క్రాప్‌ బుక్‌లు రెడీ చేసుకునేలా ప్రైమరీ స్థాయి విద్యార్థులను ప్రోత్సహించాలని'' యూపీ ప్రభుత్వం తన గైడ్‌లైన్స్‌లో వివరించింది.   

Advertisment
తాజా కథనాలు