/rtv/media/media_files/2025/04/06/zAzbkf54FRUmfR0G8TPl.jpg)
Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home
TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..
ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news