/rtv/media/media_files/2025/10/20/liquor-worth-23-crores-among-combined-seizure-of-64-crores-in-dry-bihar-2025-10-20-16-04-57.jpg)
Liquor Worth 23 Crores Among Combined Seizure Of 64 Crores In Dry Bihar
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్నారు. డబ్బులు పంచుతున్నారు. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.23.14 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి బీహార్‌లో 2016 ఏప్రిల్ నుంచి మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ అక్కడ కోట్లాది రూపాయల మద్యం దొరకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: పండగ పూట విషాదం.. కూతురితో అలా చేశాడని యువకుడిని దారుణంగా చంపిన తండ్రి!
అక్కడి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 6న ప్రకటించారు. అప్పటినుంచి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 753 మందిని బీహార్ పోలీసులు, సంబంధిత భద్రతా సంస్థల అధికారులు అరెస్టు చేశారు. 13 వేల 587 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అప్పటినుంచి రాష్ట్రంలో రూ.64 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ఇందులో 23.41 కోట్ల విలువైన మద్యం, రూ.14 కోట్ల ఉచిత వస్తువులు, రూ.16.88 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.4.19 కోట్ల నగదు ఉన్నాయి.
Also Read: నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు
ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ బీహార్ పోలీసులు, ఎక్సైజ్, కస్టమ్స్, రెవెన్యూ, ఇన్‌కమ్ ట్యాక్స్, ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, వీడియో నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. ఇదిలాఉండగా బీహార్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమల్లో ఉంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం ఎత్తేస్తామని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.